చింతలూరు (ఆలమూరు). అమ్మవారి చల్లని చూపు ప్రజల అందరిపై ఉండాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి పేర్కొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఆరాధ్య దైవమైన ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకంబిక అమ్మవారిని రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ముందుగా ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది పాడిపంటలతో అన్నదాతల ముఖంలో చిరునవ్వులు చిందించాలని, ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈమె వెంట రాష్ట్ర మహిళా నాయకురాలు దండంగి మమత, వైట్ల శేషుబాబు, పలువురు నాయకులు పాల్గొన్నారు.
అమ్మ చల్లని చూపు ప్రజల అందరిపై ఉండాలి
ADD
RELATED ARTICLES




