MCN NEWS : శ్రావణ మాసం పురస్కరించుకుని మండల పరిధిలో ఈతకోట గ్రామంలో జాతీయ రహదారి చెంతనే కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం అమ్మవార్లకు ఆలయ అర్చకులు ఖండవిల్లి నారాయణచార్యులు (నాని) ఖండవిల్లి శ్రీనివాసాచార్యులు శ్రావణమాసం ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రావణమాసంలో రెండో శుక్రవారం కావడంతో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో దుర్గాదేవి. దుర్గామాత అమ్మవార్లను దర్శించుకుని తీర్ధప్రసాదాలను స్వీకరించారు భక్తులు ఉదయం నుంచి క్యూలైన్ పాటించి అమ్మవార్లను దర్శించుకున్నారు తొమ్మిది శుక్రవారాలు 9 ప్రదక్షిణలు చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయని భక్తుల తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ వెలుగట్ల రామకృష్ణ, కమిటీ సభ్యులు పర్యవేక్షించి సేవల్ని అందించారు
ఈతకోట శ్రీ కనకదుర్గమ్మవారి ఆలయంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు
ADD
RELATED ARTICLES




