MCN NEWS : జనవరి 9వ తేదిన కచ్చపి ఆడిటోరియంలో మెప్మా ఆధ్వర్యంలో స్వయం ఉపాధి మేళా నిర్వహించనున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరపాలక సంస్థ మెప్మా పరిధిలో స్వయం ఉపాధిలో భాగంగా ఆన్లైన్ బుకింగ్ ద్వారా సేవలు అందించుటకు స్వయం ఉపాధి చేయుచున్న, శిక్షణ పొందిన వారిచే స్వయం ఉపాధి మేళా నిర్వహిస్తున్నాన్నామని న్నారు. ఇందులో హోం-అప్లయెన్సెస్ అయిన ఏసి, రిఫ్రిజిరేటర్/వాషింగ్ మిషన్ & వాటర్ ప్యూరిఫైయర్, గీజర్ రిపేర్ చేయడం, వృత్తి సంబంధిత సేవలు వడ్రంగి, ప్లంబింగ్, విద్యుత్, బ్యూటీషియన్స్ సేవలు పురుషులకు, స్త్రీలకు ఉన్నాయని అన్నారు. శిక్షణ పొందిన వారిని హోం ట్రయాంగిల్ యప్ ద్వారా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వారి సేవలు వినియోగం కొరకు 09.01.2025వ తేదీన ఉదయం 9 గంటలకు కచ్ఛపి ఆడిటోరియం, తుడా ఆఫీస్ పక్కన ఈ మేళా నిర్వహిస్తున్నమని అన్నారు. పైన తెలిపిన సర్వీసులు ద్వారా శిక్షణ పొందిన వారు ఈ మేళాను సద్వినియోగ పరచుకోవాలని కమిషనర్ తెలిపారు.
ఈ నెల 9న కచ్చపి ఆడిటోరియంలో స్వయం ఉపాధి మేళా
ADD
RELATED ARTICLES




