ఎమ్మెల్యే సత్యానందరావు
MCN NEWS : గోశాల వ్యవహారంపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు హెచ్చరించారు.రావులపాలెం క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు,ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోశాలలో గోవులు మరణించకపోయినా మరణించినట్టు రాద్ధాంతం చేయడం సరికాదని,నిజాలను బయట పెడతామని వెళ్లి రోడ్డుపై బైఠాయించడమేంటని మండిపడ్డారు.టిటిడి గోశాలలో గోవులు మృతి చెందాయని వైసిపి నేత, టిటిడి మాజీ చైర్మన్ భూమా కరుణాకర్ రెడ్డి తప్పుడు ప్రచారమని,తిరుమల లో వైసిపి హయంలో జరిగిన అక్రమాలను,అపాచారాలను సరిదిద్ది తిరుమల పవిత్రను కూటమి ప్రభుత్వం కాపాడుతోందని తెలిపారు.కూటమి ప్రభుత్వానికి, టిటిడి పాలక మండలి కి వస్తున్న మంచిపేరుచూసి ఓర్వలేక వైసీపీ రోజుకో వివాదాన్ని సృష్టిస్తోందని,నాడు వైసిపి ప్రభుత్వం వీఐపీ సేవలో తరిస్తే నేడు కూటమి ప్రభుత్వం సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తుందని అన్నారు.భూమన కరుణాకరరెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తిరుమలలో సర్వ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన భక్తులను అడిగితే ఎవరి పాలనలో తిరుమల ఎలా ఉందో భక్తులే చెపుతారని,వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించింది. ఆఖరకు భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డు తయారీలో కూడా కల్తీ నెయ్యిని వాడిందని గుర్తు చేశారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల దేవస్థానము పవిత్రతను కాపాడటానికి, సామాన్య భక్తులను మెరుగైన సేవలు అందించడానికి అనేక చర్యలు తీసుకుందని వివరించారు.వైసిపి ప్రభుత్వం హయంలో జరిగిన అక్రమాలపై విచారణ కారణంగా నాడు వారు చేసిన అరాచకాలు బయటకు వస్తున్నాయి. వాటి నుండి దృష్టి మార్చడానికి టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి టిటిడి గోశాలలో గోవులు మృతి చెందాయని దృష్ప్రాచారం చేస్తున్నారని ఎమ్మెల్యే సత్యానందరావు ఆరోపించారు.ఈ కార్యక్రమంలో విల్లా మారుతీ, కొప్పిశెట్టి ప్రసాద్, బొక్క ప్రసాద్, బోడపాటి మారుతీ, మజ్జి తరుణ్, జక్కంపూడి బాలాజీ,కముజు వర ప్రసాద్,దంగేటి సాయి మరియు తదితరులు పాల్గొన్నారు.




