MCN NEWS : కొత్తపేట. డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల వంతెన సమీపంలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం శనివారం అంగ రంగ వైభవంగా జరిగింది.అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత భారీ అన్నసమారాధన నిర్వహించారు. ఈ ఆలయం స్థాపించి 40 ఏళ్లు పూర్తిఅవ్వడంతో భక్తులు పోటెత్తారు.ఆలయానికి ఎదురుగా ఉన్న కాలువ దగ్గర ఆలయ కమిటీ చొరవతో భక్తులకు నీటి కొరత లేకుండా ప్రత్యేక వాటర్ ట్యాంక్ నిర్మించి నిత్యం నీరు అందుబాటులోకి తెచ్చామని ఆలయ కమిటీ తెలిపింది.ఆ కాలువ దగ్గర ఉన్న పాంచాల రేవు దగ్గర నిత్యం భక్తుల రద్దీతో ఎన్నో కార్యక్రమాలు జరుతున్నాయని కాలువ నీరు ఒక్కోసారి తక్కువ ఉండడం మరియు చీకటి సమయాలలో భక్తులు ఇబ్బందులు పడుతుండడంతో ఈ వాటర్ ట్యాంక్ మరియు కుళాయాలు నిర్మించమని ఆలయ కమిటీ తెలిపింది.ఈ స్వామి వారిని కళ్యాణ వెంకన్నగా కూడా పిలుస్తారు.ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉందని ఐదు శనివారములు ఈ ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటే కళ్యాణం కూడా అవుతుందని మరియు కోరుకున్న కోరికలు తీరుస్తారని ప్రజల విశ్వాసం.ప్రతి ఏటా నిర్వహించే అన్నసమారాధన కంటే ఈ ఏడు 40 ఏళ్లు పూర్తిఅవ్వడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం ఆనందదాయకమని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
కళ్యాణ వెంకన్నకు వైభవంగా కళ్యాణ మహోత్సం
ADD
RELATED ARTICLES




