MCN NEWS : వైసిపి ఐదేళ్ల విధ్వంసాన్ని కూటమి పాలన సరిచేసి రాష్ట్రాభివృద్ధిని సాకారం చేస్తుందని రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖామంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు అన్నారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం గోపాలపురంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గ పర్యటనకు వచ్చిన మంత్రికి ఎమ్మెల్యే బండారు ఆత్మీయ స్వాగతం పలికారు. ముందుగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గోపాలపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన నిర్వహించారు.
గోపాలపురం సిద్ధార్థ నగర్ లో గ్రామపంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.30 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు, డ్రైనేజీలను ప్రారంభించారు. అనంతరం స్థానిక యాళ్లవారి వీధి లో సంత మార్కెట్ వద్ద గ్రామపంచాయతీ నిధులు రూ.60 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు, డ్రైనేజీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోపాలపురం లాకుల వద్ద రూ.1.70 కోట్ల నాబార్డ్ నిధులతో నిర్మించ తలపెట్టిన ఆర్ అండ్ బి రహదారి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్థానిక గౌడ కమ్యూనిటీ హాలు వద్ద సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారుతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్, స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఏడాది కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు