MCN NEWS : కూటమిపాలనలో రాష్ట్రం పురోభివృద్ధి దిశగా పయనిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. బుధవారం కోనసీమ తిరుమల వాడపల్లిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా ఆయన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అమలుపరిచిన హామీలు, సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో గుర్తు చేశారు. విధ్వంసం పాలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టి వికాసం దిశగా పయనింపచేస్తున్నామన్నారు. ప్రజల ఆశయాలకు ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ,కరుటూరి నరసింహారావు,కుశంపూడి రామకృష్ణంరాజు,కాయల జగన్నాధం, ఎరుబండి రాజు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేస్తున్నాం
ADD
RELATED ARTICLES