MCN NEWS : రైతుల వద్దకే ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు.ఆత్రేయపురం లొల్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో గ్రామాల్లోని రైతు సేవ కేంద్రాల ద్వారా రబీ సీజన్ ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పారు.గత ప్రభుత్వంలో ధాన్యం అమ్ముకోవడానికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ధాన్యం ఎక్కడో సుదూర ప్రాంతాల మిల్లుకు తీసుకెల్లేవారని గుర్తు చేసారు. సరైన పద్ధతి లేక ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.నానా కష్టాలు పడి ధాన్యం అమ్మితే ఆ సొమ్ము ఎప్పడు వస్తాదో కూడా అర్థం కాని పరిస్థితి ఉందన్నారు.కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామాల్లోనే రైతుల ధాన్యం రైతుల సమక్షంలోనే కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు.ధాన్యం సొమ్మును రైతుల ఖాతాల్లో వేయడానికి 48 గంటలు సమయం ఇచ్చినా కేవలం రెండు గంటల వ్యవధిలో సొమ్ములు జమ చేయడం జరిగిందని చెప్పారు.ఈ రబీ సీజన్లో సాధారణ రకం ధాన్యం క్వింటాకు 2300 రూపాయలు,75 కేజీలకు 1725 రూపాయల చొప్పున కనీస మద్దతు ధర ఇస్తున్నామన్నారు.అలాగే ఎ రకం గ్రేడ్ ధాన్యం క్వింటాకు 2320 రూపాయలు,75 కేజీలకు 1740 రూపాయలు కనీస మద్దతు ధర ఉందన్నారు.అంతే కాకుండా గోనె సంచుల,హమాలీ మరియు రవాణా చార్జీలను రైతుల ఖాతాల్లోకి చెల్లించే వెసులుబాటును కూటమి సర్కార్ కల్పించిందని తెలిపారు.రైతే రాజు అన్న మాటను నిజం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే సత్యానందరావు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకటరాజు (గబ్బర్ సింగ్ ),కరుటూరి నరసింహారావు, కాయల జగన్నాధం,దాట్ల సూర్యనారాయణ,కల్లూరి సత్తిపాండు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రైతుల వద్దకే ప్రజా ప్రభుత్వం – ఎమ్మెల్యే సత్యానందరావు
ADD
RELATED ARTICLES




