MCN NEWS : కూటమి పాలనలో మన రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆలమూరు మండలం చెముడులంకలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసిపి హయాంలో పరదాల పాలన నడిచేదని కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజా పాలన నడుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామంలోని ప్రతీ ఇంటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమం, అభివృద్ధి ఫలాల గురించి వివరించారు. నేరుగా ప్రజలతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. పొగాకు వ్యాపారులను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలులో తల్లికి వందనం పథకం దేశంలోనే చరిత్ర సృష్టించిందని వ్యాఖ్యానించారు. ఒకటవ తారీఖునే ఠంచనుగా పింఛన్లు, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు, గ్రామాల్లో పరుగులు పెడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇలా అన్ని అంశాల్లో కూటమిపాలన ప్రజల ఆదరాభిమానాలను పొందుతుందన్నారు.
సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు
ADD
RELATED ARTICLES