MCN NEWS : ఆలమూరు. ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్‌ను వినియోగించుకోవాలని ఆలమూరు విద్యుత్ శాఖ ఏఈ దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు.మండలంలోని జొన్నాడ గ్రామంలో ఆయన శుక్రవారం పర్యటిస్తూ విద్యుత్ లైన్లను పరిశీలించారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. మండలంలోని అన్ని గ్రామాలలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంలో భాగంగా సోలార్ రూఫ్ టాప్స్ ఏర్పాటు చేసుకున్న వారికి ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందని తెలిపారు. గృహ వినియోగదారులు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుతో విద్యుత్ బిల్లులు ఆదా చేసుకోవచ్చని తెలిపారు. అలాగే గృహ విద్యుత్ వినియోగంలో అదనపు లోడ్ను క్రమబద్ధీకరించుకోవాలని ఆయన తెలిపారు. గృహ వినియోగానికి సంబంధించి చాలా వరకు మొదట ఒక కిలో వాట్ లోడ్తోనే కనెక్షన్ తీసుకుంటారని, అయితే ఆ తర్వాత ఏసీలు, ఇతరత్రా వాటితో లోడు రెండు, మూడు కిలో వాట్స్కు పెరుగుతుందన్నారు. వినియోగించిన విద్యుత్కు వినియోగదారులు చార్జీలు చెల్లిస్తున్నప్పటికీ ట్రాన్స్ఫార్మర్పై లోడు పెరుగుతుండటం వల్ల కాలిపోవడం, లో ఓల్టేజీ, హైవోల్టేజీ సమస్యలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. అదనపు లోడ్ను క్రమబద్ధీకరించుకుంటే ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యంపై పూర్తి స్పష్టత వస్తుందన్నారు. అదనపు లోడు క్రమబద్ధీకరణకు డిపార్టుమెంటుకు చెల్లించాల్సిన రుసుములో 50 శాతం రాయితీతో ఏపీఎస్పీడీసీఎల్ వెబ్సైట్ www.apspdcl.on, సమీపంలోని మీ సేవ, గ్రామ, వార్డు సచివాలయాల్లో చెల్లించవచ్చని తెలిపారు. ఈ అవకాశం ఏప్రియల్ 30 వరకు ఉందన్నారు. కావున ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు._
సోలార్ విద్యుత్‌ను వినియోగించుకోవాలి
ADD
RELATED ARTICLES




