MCN NEWS : ఓఎన్జీసీ సంస్థ ద్వారా స్థానిక ప్రాంతాల అభివృద్ధిని చేసుకోవడం మా హక్కు అయిన అభివృద్ధిని చేసి తీరాలని ఆలమూరు మండలం పెదపల్ల గ్రామం ఓఎన్జీసీ జిసిఎస్స్టేషన్ వద్ద ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు డిమాండ్ చేశారు.అలాగే 8110 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు సంబంధించి ఓఎన్జీసీ సంస్థ కార్యకలాపాలు నిర్వహించడానికి చేస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలో అభిప్రాయాలను సేకరించి వాటిని పరిశీలించాలన్నారు.సంస్థ కార్యకలాపాల విలువను బట్టి స్థానిక ప్రాంతాల అభివృద్ధికి ఇవ్వాల్సిన వాటా హక్కును ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల అభివృద్ధి కోసం కోరిన మేరకు నిధులను మంజూరు చేయాలని కోరారు.అలాగే సంస్థ కార్యకలాపాలు ప్రారంభించడానికి రైతుల నుండి భూములు లీజుకు తీసుకుంటున్నారని పని పూర్తయ్యాక రైతులను సంస్థ పట్టించుకోవడం లేదన్నారు.మరలా ఆ భూములు రైతులకు ఉపయోగకరంగా ఉండటం లేదని దాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు పూర్తి న్యాయం చేయాలని ఓఎన్జీసీ అధికారులను కోరారు.గ్రామాల్లో రోడ్ల,వంతెనల నిర్మాణానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం కొత్తపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు 84.96 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని ఓఎన్జీసీ అధికారులకు ఎమ్మెల్యే సత్యానందరావు వినతి పత్రాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
స్థానిక ప్రాంతాల అభివృద్ధి చేయాల్సిందే
ADD
RELATED ARTICLES




