Wednesday, May 22, 2024
spot_imgspot_imgspot_imgspot_img
Homeతూర్పుగోదావరి జిల్లాగ్రాసిం నుండి వెళ్లిపోయిన స్థానిక ఉద్యోగులు

గ్రాసిం నుండి వెళ్లిపోయిన స్థానిక ఉద్యోగులు

MCN NEWS : బిక్కవోలు, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం బలబద్రపురం గ్రామంలో గ్రాసిం ఇండస్ట్రీస్ వల్ల స్థానిక ఉద్యోగులు పరిస్థితిపై కథనాలను ప్రచురించడంతో అనేక మంది స్థానిక ఉద్యోగులు, ఉద్యోగ అర్హత కలిగిన నిరుద్యోగులు స్పందిస్తున్న తీరు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు అయితే ఇప్పటివరకు గ్రాసిం ఇండస్ట్రీలో పనిచేస్తున్న వారు అందరూ పర్మినెంట్ వర్కర్లని అనుకుంటున్నామని పత్రికల్లో వచ్చిన కథనాలను చదివిన తర్వాత ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోయే కూలీలుగా ఉన్నారని అర్థమైందని మా కళ్ళు తెరిపించారంటూ చుట్టుపక్కల గ్రామాల వారు గ్రసిమ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్న ఉద్యోగులు కొంతమందిని అడగగా ఇండస్ట్రీస్ లో రెండవ స్థాయి మూడవ స్థాయి ఉద్యోగులుగా మాత్రమే స్థానికులు ఉన్నారని వారు తెలిపారు ఉద్యోగం వదిలేసిన స్థానికుల్ని కార్మికుల్ని వివరణ కోరగా ఒక సంవత్సరం పూర్తయిన స్థానిక కార్మికుల్ని పని భారంతో వేధిస్తారని ఆ వేదింపుకి తట్టుకోలేక మనం చేయలేము అని మనతోనే అనిపించే విధంగా ఉన్నత స్థాయి ఉద్యోగులు ప్రవర్తిస్తారని చివరికి స్థానికులచేతే మేము చేయలేము అని అనిపించి బయటకు పంపేస్తారని ఉద్యోగం వదులుకున్న స్థానికులు చెప్పడం విశేషం ఆ విధంగా చేయడంతో స్థానిక ఉద్యోగులను పర్మినెంట్ చేసే అవసరం ఉండదు. గ్రాసింగ్ ఇండస్ట్రీలో బ్రిటిష్ పాలన సాగుతుంది అనడానికి ఇదే నిదర్శనం అని పలువురు వాపోతున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తదితర సంబంధిత రాష్ట్రస్థాయి అధికారులు స్పందించకుంటే పలు యువజన సంఘాలు ధర్నాలకు దిగే అవకాశం లేకపోలేదు అంటూ పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు

spot_img

ADD

spot_imgspot_imgspot_imgspot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments