MCN NEWS : కాకినాడ. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మాజీ మేయర్, కాకినాడ జిల్లా తెలుగు మహిళ అధ్యక్షురాలు సుంకర పావని తిరుమల కుమార్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాపరిషత్ సెంటర్ లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద నల్ల బెలూన్లు , బాబు తో మేము అనే ప్ల – కార్డులు ప్రదర్శిస్తూ, రోడ్డు పై నిరసన తెలియజేశారు. అనంతరం పావని తిరుమల కుమార్ మాట్లాడుతూ 14 సంవత్సరాలు అవినీతి మచ్చ లేకుండా ముఖ్యమంత్రి పనిచేసిన 75 సంవత్సరాల చంద్ర బాబు నాయుడు ని ., 32 రోజులుగా అక్రమంగా జైలులో ఉంచి పైశాచిక అనందం పొందుతున్న వైసీపీ నాయకులను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. అధికారదర్పం తో విర్రవీగుతున్న జగన్ రెడ్డికీ పతనం తప్పదని, మళ్ళీ జైలు జీవితమేనని సుంకర పావని అన్నారు. ఈ కార్యక్రమంలో సుంకర పావని వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు, చల్లా పార్వతి, పాలిక సత్య, నక్కా జ్యోతి, రేలంగి లక్ష్మి, కనకం, దుర్గ, సత్యవతి, నిర్మల, రమణ, భ్రమరాంబ, చింతా భవానీ తదితరులు పాల్గోన్నారు.
నల్ల బెలూన్స్ తో తెలుగు మహిళల నిరసన ప్రదర్శన.
ADD
RELATED ARTICLES