MCNNEWS : అన్నవరం. వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం లో దేవస్థాన అధికారులు సోమవారం నాడు పురోహితుల సరఫరా, బహిరంగ వేలం పెట్టిన సంగతి విధితమే. దీనిపై పురోహిత సంఘాలు మండిపడుతున్నారు. పురోహితులను సరఫరా చేయడమేంటి పురోహితులు ఏమైనా వస్తువ అని బహిరంగంగానే కొంతమంది విమర్శలు చేస్తున్నారు. గతంలో రెండు సార్లు పాటలు పెట్టినప్పుడు కమిషనర్ రద్దు చేయడాని గుర్తు చేశారు. పురోహితుడు అంటే ప్రజల హితవు (మంచి) కోరేవాడని, పురోహితులకు భక్తులకు అనుసంధానం ఉంటుందని, వారి కుల ఆచారాన్ని బట్టి ప్రస్తుతం డబ్బులు తీసుకోవడం జరుగుతుందని, ప్రస్తుతం లేనివారు ఉంటే 1500 రూపాయలు కూడా పెళ్లి దేవస్థానంలో చేయిస్తున్నారని ,ఇప్పుడు దేవస్థానం వారు 5000 కట్టమంటే అది ధన అర్జున అవుతుందని , ఏదైనా సరే దేవస్థానం వారు పాట పెట్టాలని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని పురోహిత సంఘాలు హెచ్చరిస్తున్నారు
మండిపడుతున్న పురోహిత సంఘాలు.
ADD
RELATED ARTICLES