MCN NEWS : జిల్లాలో గడపగడపకు మన ప్రభుత్వం(జీజీఎంపీ) కార్యక్రమంలో భాగంగా మంజూరు చేసిన పనులకు సంబంధించి ఇంకా ప్రారంభంకాని పనులను రానున్న వారం రోజుల్లో గ్రౌండింగ్ పూర్తిచేయాలని జిల్లా కలెక్టరు డా. కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. శనివారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టరు కృతికా శుక్లా.. ప్లానింగ్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఏపీఈపీడీసీఎల్, సోషల్ వెల్ఫేర్, వివిధ మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లతో కలిసి జిల్లాలో జీజీఎంపీ పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు కృతికా శుక్లా మాట్లాడుతూ జిల్లాలో ప్రతి గ్రామ/వార్డు సచివాలయం పరిధిలో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, సామాజిక భవనాల నిర్మాణం నిమిత్తం రూ.20 లక్షలు మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంజూరు చేసిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ఇంకా ప్రారంభంకాని పనులను రానున్న వారం రోజుల్లో గ్రౌండింగ్ పూర్తి చేయాలని కలెక్టరు అధికారులకు ఆదేశించారు. సమావేశంలో సీపీవో పీ.త్రినాథ్, సోషల్ వెల్ఫేర్ జేడీ డీవీ.రమణమూర్తి, కాకినాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎస్ఈ పి.సత్యకుమారి, ఏపీఈపీడీసీఎల్ ఈఈ ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు, వివిధ పురపాలక సంఘాలు కమిషనర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వారం రోజుల్లో గ్రౌండింగ్ పూర్తి చేయాలి-జిల్లా కలెక్టరు డా. కృతికా శుక్లా
ADD
RELATED ARTICLES