MCNNEWS : అన్నవరం గ్రామం డిగ్రీకాలేజీ సమీపంలో శుక్రవారం సాయింత్రం కోళ్ల అప్పలనర్స (పాప) నివాసం ఉండే పూరి పాక విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధం అయ్యింది. అగ్నిభాదిత ప్రాంతానికి చేరుకున్న ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ బాధితురాలు కోళ్ల అప్పలనర్స నుండి వివరాలు ఆడిగితెలుసుకున్నారు.
ప్రభుత్వ పరంగా అన్ని విదాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దారా రమణ, గ్రామ సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా, ఉప సర్పంచ్ బొబ్బిలి వెంకన్న, బిఎస్ఎన్ఎల్ టిఎసి మెంబర్ కొండపల్లి అప్పారావు, అసిన శ్రీను, మడ్డు వీరబాబు, గునూరి అన్నవరం, ఈగల రాఘవ తదితరులు పాల్గొన్నారు.