Tuesday, April 30, 2024
spot_imgspot_imgspot_imgspot_img
Homeకాకినాడ జిల్లాగృహనిర్మాణాలు మమ్మరం చేయాలి-జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా

గృహనిర్మాణాలు మమ్మరం చేయాలి-జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా

MCN NEWS : మెగా కంప్లిషన్ డ్రైవ్ క్రింద జిల్లాలో రానున్న రెండు నెలల్లో జగనన్న కాలనీలలో గృహనిర్మాణాలను మమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమీషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివిధ ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాల అమలు ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే ఫిబ్రవరి నెల రెండవ వారంలో మరో విడత సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహించనున్నామని, ఇందులో సుమారు 15 వేల మంది లబ్దిదారులు నూతన గృహప్రవేశం చేసేందుకుగాను డిశంబరు, జనవరి నెలల్లో జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలను ముమ్మరం చేయాలని మండల అధికారులు, మున్సిపల్ కమీషనర్లను కలెక్టర్ ఆదేశించారు. ఇందుకు అవసరమైన నిర్మాణ సామాగ్రి సేకరణ , లబ్దిదారులకు రుణ సహాయం కల్పన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, బేస్ మెంట్ స్థాయిలో ఉన్న ఇళ్లన్నిటి నిర్మాణాన్ని స్పెషల్ డ్రైవ్ గా చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలోని ఆడుదాం ఆంధ్రా క్రీడా సంబరాల నిర్వహణకు అన్ని సచివాలయాల పరిధిలో క్రీడాకారుల నమోదు, క్రీడా స్థలాల ఎంపిక, క్రీడా సామగ్రి కిట్ల సరఫరా అంశాలను సత్వరం పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాధాన్యతా భవనాలన్నిటి త్వరితగతిన పూర్తి చేసి వినియోగం లోకి తేవాలన్నారు. జిల్లాలో ఆరోగ్యశ్రీ లబ్దిదారుల ఈకేవైసి, కార్డుల పంపిణీ ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, హౌసింగ్ పిడి వై.శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కమీషనర్లు పాల్గొన్నారు.

spot_img

ADD

spot_imgspot_imgspot_imgspot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_imgspot_imgspot_imgspot_img

Most Popular

spot_imgspot_imgspot_imgspot_img

Recent Comments